కాళేశ్వరం తప్పిదాలను లేవనెత్తితే తప్పేంది?.. బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సీరియస్

by Gantepaka Srikanth |

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి(MLC Anji Reddy) సీరియస్ కామెంట్స్ చేశారు.

కాళేశ్వరం తప్పిదాలను లేవనెత్తితే తప్పేంది?.. బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి(MLC Anji Reddy) సీరియస్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరంపై బండి సంజయ్ వాస్తవాలు మాట్లాడితే బీఆర్ఎస్ నేతలకు అంత ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. కాళేశ్వరం తప్పిదాలను లేవనెత్తితే తప్పేంటని అడిగారు. కాళేశ్వరంపై స్వతంత్ర్య సంస్థ NDSA, తుమ్మడిహట్టి నీటి నిల్వపై CWC వాస్తవాలతో రిపోర్ట్ ఇస్తే... వాటినే తప్పుపడతారా? అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ఎందుకు కప్పిపుచ్చుతోంది? అన్నారు.

ఎందుకు సీబీఐ విచారణ జరపడం లేదు?, సీడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనుకుంటున్నారా?, సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) ఇచ్చిన నివేదికనే తప్పుపడతారా?, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు అంచనాను రూ.1.2 లక్షల కోట్లకు పెంచి దోచుకోవడం నిజం కాదా? అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామని గతంలో మాట్లాడిన రాహుల్ గాంధీ ఇప్పుడెందుకు స్పందించడం లేదని అడిగారు. కాళేశ్వరం అవినీతి సొమ్ములో కేసీఆర్ కాంగ్రెస్ నేతలకు వాటా ఇచ్చారా? అని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. ఇకనైనా బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.

Next Story