- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇలా జరుగుతుందని అనుకోలేదు’.. సుప్రీంకోర్టు తీర్పుపై MLC అలీఖాన్ స్పందన
by Gantepaka Srikanth |
సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్(MLC Amer Ali Khan) స్పందించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్(MLC Amer Ali Khan) స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పు ఇస్తుందని అనుకోలేదు. కోర్టు ఆర్డర్ చదివిన తర్వాత అన్ని మాట్లాడుతాను. కాసేపటి క్రితమే లాయర్ కాల్ చేసి సుప్రీం కోర్టులో జరిగిన విషయాలు చెప్పారు. నేను మొన్నటి వరకు జర్నలిస్టును. నాకు ఎలాంటి రాజకీయం బ్యాక్ గ్రౌండ్ లేదు. నాటి ప్రభుత్వ పెద్దలు ఇంకా ఏం మాట్లాడలేదు’ అని ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ అన్నారు. కాగా, తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వారి నియామకాలను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది.
Next Story






