- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Addanki Dayakar: బూతు రాజా కేసీఆర్.. మాజీ మంత్రి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ కౌంటర్
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కామెంట్స్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy) కామెంట్స్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక వీడియో విడుదల చేశారు. జగదీశ్వర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు నిరుత్సాహంతో కూడుకున్నవని అన్నారు. నిరాశ, నిస్పృహలతో కూడిన విమర్శలు గానే చూడాలి తప్ప అందులో వాస్తవాలు లేవని చెప్పారు. ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా నిసిగ్గుగా అబద్దాలు చెబుతున్నారని, ఉమ్మడి నల్గొండ ప్రాంతాల్లో చుక్క నీరు ఇవ్వలేదని ఆరోపించారు. కనీసం ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు టన్నెల్ కూడా పూర్తి చేయలేని ఒక దివాలాకోరు ప్రభుత్వం గతంలో పాలించిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అబద్దాలు చేప్పే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలను అడిగే వారే చెబుతారని అన్నారు. రికార్డు స్థాయిలో పంట మీరు కట్టిన ప్రాజెక్టుల వల్ల వచ్చిందా? అని ప్రశ్నించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఏదీ మీరు కట్టారని ప్రశ్నించారు. ఆయన అస్థిత్వం కోల్పోతున్న క్రమంలో కేసీఆర్‌ను మెప్పిండానికి.. నేను ఉన్నా అని చెప్పుకోడానికి ఆయన మాట్లాడుతున్నారని అద్దంకి విమర్శించారు.
మీరు మాట్లాడితే రాజకీయం ఇతరులు మాట్లాడితే బూతు.. అని, మీ పార్టీ నాయకులు మాట్లాడే బూతు మాటల కంటే ఇంకా ఎవరైనా మాట్లాడతారా? అని నిలదీశారు. బూతులకు బ్రాండ్ అంబాసిడర్ (KCR) కేసీఆర్.. ఎవరూ బూతు రాజా అంటే కేసీఆర్ అనే పరిస్థితి నేడు వచ్చిందన్నారు. అలాంటి నేడు మర్యాదగా మాట్లాడిన మీకు బూతులా కనబడితే మేము చేయాల్సిందేమి లేదన్నారు. ప్రజలు మీ పరిపాలన పోయాక సంతోషంగా ఉన్నారని, పది సంవత్సరాల్లో తెలంగాణ, ఉమ్మడి నల్లగొండ జిల్లా కి మీ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆరోపించారు. కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లా అంశంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమగ్ర ప్రణాళికను ఇప్పటికైనా చూసి మాట్లాడాలని జగదీశ్ రెడ్డికి హితువు పలికారు.






