- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ కథను మా రాహుల్‌గాంధీ ముగిస్తాడు.. రఘునందన్ రావుకు అద్దంకి దయాకర్ కౌంటర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైన మాట్లాడేంత స్థాయి మెదక్ ఎంపీ రఘనందన్ రావుకి లేదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైన మాట్లాడేంత స్థాయి మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao)కి లేదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక వీడియో విడుదల చేశారు. అడ్డిమారి గుడ్డి సూటితో కన్నులొట్టపోయినట్లు బీఆర్ఎస్ సహకారంతో ఎంపీగా గెలిచావని హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుతో ఒప్పందం చేసుకుని మెదక్ ఎంపీ అయ్యావని ఆరోపించారు. (Rahul Gandhi) రాహుల్ గాంధీకి, నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. పెద్ద వాళ్ల పైన మాట్లాడితే పెద్ద వాడివి అయిపోతానని రఘునందన్‌రావు అనుకుంటున్నాడు.. నీకంత సీన్ లేదు.. బీజేపీలోనే నీకు బేస్ లేదు.. అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాహుల్‌గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము మీకు లేదన్నారు. ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నిస్తుంటే మీరేందుకు ఉలిక్కి పడుతున్నారు.. అసలు మీ భయం ఏంటి..? మీకెందుకంత వణుకు..? అని ప్రశ్నించారు. ఓటర్ల జాబితా చిత్ర విచిత్రాలను మా రాహుల్‌గాంధీ బయటపెడుతున్నారని, చనిపోయిన వాళ్లతో టీ తాగే అద్భుత అవకాశం ఈసీ రాహుల్ గాంధీకి ఇచ్చిందని తెలిపారు. చనిపోయిన వాళ్లు ఏకంగా సుప్రీంకోర్టులో ప్రత్యక్షమౌతున్నారని, రాహుల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈసీ నీళ్లు మింగుతోందని విమర్శించారు. బండారం బయటపడుతుందనే భయంతో బీజేపీ నాయకులున్నారని, మీరెంత మాట్లాడినా ఉపయోగం లేదు.. మీ కథ ను మా రాహుల్ గాంధీ ముగిస్తాడు చూడండి.. అంటూ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు.






