- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చావుదెబ్బ కొట్టినా కేటీఆర్ అహంకారం తగ్గలేదు: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి అనీ తానై నడిపించారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కొనియాడారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ పై గ్రాండ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విజయంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా ఓటర్లు చావుదెబ్బ కొట్టినా కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదని విమర్శించారు. రాజకీయంగా పతనమైనా ఆయన తీరు మారలేదన్నారు. కేటీఆర్ తోనే బీఆర్ఎస్ పతనమవ్వడం ఖాయమన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి అనీ తానై నడిపించారని కొనియాడారు. రాజకీయంగా కేసీఆర్ మాట్లాడితే ప్రవచనాల్లాగా.. సీఎం రేవంత్ కౌంటరిస్తే బూతుల్లాగా వినిపిస్తున్నాయా? అని కేటీఆర్ ను ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కు రాజకీయ మిత్రుత్వం ఉందన్నారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని కేటీఆర్ అంటున్నారని, అరెస్ట్ చేయడానికి దమ్ము ఉండనక్కర్లేదని, పోలీసులకు చెబితే చేస్తారని తెలిపారు.






