రిపబ్లిక్ డే రోజు సీఎంను అవమానించిన కేటీఆర్.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్

by Ramesh Naini |

గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని, రాజ్యాంగ బద్ధ హోదాలో ఉన్న స్పీకర్, సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ అవమానించారని, ఈ సందర్భంగా కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు.

రిపబ్లిక్ డే రోజు సీఎంను అవమానించిన కేటీఆర్.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక వీడియో విడుదల చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని, రాజ్యాంగ బద్ధ హోదాలో ఉన్న స్పీకర్, సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ అవమానించారని, ఈ సందర్భంగా కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. సభలో ఒక సభ్యుడిగా ఉంటూ రాజ్యాంగ బద్ధమైన హోదాలో సభాపతిని ధృతరాష్ట్రుడితో పోల్చడం ఏం సంస్కారం? ఏం సంస్కృతి? అని నిలదీశారు. రాజ్యాంగం, బాబా సాహెబ్ అంబేడ్కర్‌ని ముందు పెట్టి సీఎంను అవమానించేలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఏ రాజనీతి? అని మండిపడ్డారు. ‘ఒకవైపు మీ నాన్న రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతూ.. భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన ఘనుడు. రాజ్యాంగ వ్యతిరేకులుగా మారి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నాటకాలు వేస్తూ, ఆడిస్తున్నారు. రాజ్యాంగ హోదాలో ఉన్న వారిని అవమానించాలని రాజ్యాంగం చెప్పిందా? ఇదేనా రాజనీతి?, ఇదేనా మీకు తెలిసిన రాజకీయం’ అని ఫైర్ అయ్యారు. ఇలాంటి అహంకారం వల్లే మీకు ఈ స్థితి వచ్చిందని మండిపడ్డారు.

Next Story