- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యేలు మాధవరం vs అరెకపూడి గాంధీ.. ఇద్దరి ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి చర్చ మొదలైంది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు vs ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాటల యుద్ధం కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి చర్చ మొదలైంది. రాజకీయ రంగం ఇప్పుడు మాధవరం కృష్ణారావు vs అరెకపూడి గాంధీ మాటల యుద్ధంగా మారింది. గత కొద్ది రోజులుగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. అక్రమ ఆస్తులు, భూముల వ్యవహారంపై ఇద్దరి మధ్య మాటల తూటాలు ఎగురుతున్నాయి.
ఆదివారం ఎమ్మెల్యే అరెకపూడి చేసిన వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ — “ఇద్దరి ఆస్తులపై విచారణ జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం. ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్టు నిరూపిస్తే, ఏ శిక్షకైనా నేను సిద్ధం” అని స్పష్టం చేశారు.
మాధవరం కృష్ణారావు తనపై చేస్తున్న ఆరోపణలపై సీబీ సీఐడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, అరెకపూడి గాంధీ ఆస్తులపై కూడా మాధవరం తీవ్ర విమర్శలు గుప్పించారు. “గాంధీకి కర్నూలులో 500 ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో 200 ఎకరాల భూమి ఉన్నాయి. నీకు ఉన్న అన్ని ఆస్తులపై విచారణకు సిద్ధమా? గాంధీ ఎస్టేట్ నుంచి విచారణ మొదలు పెడదామా?” అంటూ సవాల్ విసిరారు.
ఈ పరస్పర వ్యాఖ్యలతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం మరింత ముదురుతోంది. రాజకీయ వర్గాల్లో ఈ మాటల యుద్ధం పెద్ద చర్చగా మారింది. ఇకపోతే, ఈ వివాదంపై బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.






