- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పీకర్ ఛాంబర్‌లో బీఏసీ మీటింగ్.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశంలో ఎమ్మెల్యేలు చర్చిస్తున్నారు. ...

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana assembly meetings) ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీ సమావేశంలో ఎమ్మెల్యేలు చర్చిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో సమావేశమైన బీఏసీ(BAC)సభ్యులు.. రాష్ట్ర బడ్జెట్‌తో పాటు అసెంబ్లీ ఉభయసభల నిర్వహణపై చర్చిస్తున్నారు. ఈ మీటింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy)తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాగా ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. రూ.3.20 లక్షల కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ రెడీ చేసింది. ఈ నేపథ్యంలో బడ్జెట్, పాలనపై అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడటంతో బీఏసీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది.






