‘నీది ఏ పార్టీరా ల*కొడకా.. పార్టీ మారి మా పార్టీలోకి వచ్చావ్’ టికెట్ కోసం ఎమ్మెల్యేపై బూతుల వర్షం

by Prasad Jukanti |   (  Updated:2026-02-03 06:25:06  IST  )

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మళ్లీ రగిలాయి.

‘నీది ఏ పార్టీరా ల*కొడకా.. పార్టీ మారి మా పార్టీలోకి వచ్చావ్’ టికెట్ కోసం ఎమ్మెల్యేపై బూతుల వర్షం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల వ్యవహారం భగ్గమంటోంది. ప్రధాన పార్టీలలోని ఆశవాహులు ఈ సారి ఎలాగైనా తమకే బీ-పామ్స్ ఇవ్వాలని పార్టీ పెద్దల వద్ద పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో మున్సిపాలిటీ టికెట్ల కేటాయింపు వ్యవహారం జగిత్యాల కాంగ్రెస్‍లో (Jagtial Congress) మరోసారి చిచ్చురాజేసింది. టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay) మధ్య మరోసారి వైరం భగ్గుమంది. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే ఎక్కువ టికెట్లు ఇచ్చారని జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 50 సీట్లలో ఎమ్మెల్యే వర్గానికి 30 సీట్లు ఇచ్చి తన వర్గానికి కేవలం 20 సీట్లు మాత్రమే ఇచ్చి నా మెడ కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకున్న కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఎమ్మెల్యే సంజయ్‍పై బూతులతో రెచ్చిపోయారు. 'నీది ఏ పార్టీరా లం*కొడకా పార్టీ మారి మా కాంగ్రెస్ లోకి వచ్చావ్. ఏనాడైనా కాంగ్రెస్ జెండా మోశారా? ఇప్పుడు పార్టీలోకి వచ్చి మా కడుపు కొట్టారు' అంటూ బూతులతో రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి.

పరిష్కారం చూపని ప్రజాభవన్ మీటింగ్?:

జగిత్యాల కాంగ్రెస్‍లో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ వైరం నడుస్తోంది. సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని జీవన్ రెడ్డి మొదటి నుంచి విభేదిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) సంజయ్ సంగతి ఏంటో చూస్తామని ఇటీవల జీవన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో 26 జనవరి నాడు ప్రజాభవన్‍లో జరిగిన మంత్రుల మీటింగ్ కూడా జగిత్యాల కాంగ్రెస్ వివాదంపైనే జరిగిందనే ప్రచారం జరిగింది. సీఎం రాష్ట్రంలో లేని సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి తదితురులు పాల్గొన్న ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. అయితే పాలనపరమైన అంశాలపై చర్చించేందుకే మంత్రులం సమావేశమైయ్యామని ఈ సమావేశానికి హాజరైన మంత్రులు క్లారిటీ ఇచ్చారు. అయితే పైకి అలా చెప్పినా అంతర్గతంగా జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ మధ్య పొడచూపుతున్న విభేదాలపై చర్చించినట్లు ప్రచారం జరిగింది. ఇదే నిజం అయితే మంత్రులు ప్రత్యేకంగా సమాశమైనా జగిత్యాల కాంగ్రెస్ లో విభేదాలకు పరిష్కారం దొరకలేదా అనే చర్చ తెరమీదకు వస్తోంది. ఓ వైపు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే క్షేత్రస్థాయిలో ఈ విభేదాలు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి మరి.

పోలీసుల అప్రమత్తం:

ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేది కావడంతో ఇవాళ ఉదయం నుంచే జీవన్ రెడ్డి వర్గీయులు తీవ్ర స్థాయిలో ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే ఇల్లు, క్యాంపు కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు పెంచారు.

Next Story