- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన ఈడీ విచారణ.. స్పందించిన వివేక్ వెంకటస్వామి
by GSrikanth |
ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఈడీ విచారణ ముగిసింది. గురువారం సుమారు నాలుగు గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన్ను విచారించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఈడీ విచారణ ముగిసింది. గురువారం సుమారు నాలుగు గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన్ను విచారించారు. విచారణ అనంతరం ఎమ్మెల్యే వివేక్ మీడియాతో మాట్లాడారు. ఫెమా నిబంధనలు తాను ఉల్లంఘించలేదని మరోసారి స్పష్టం చేశారు. తాను బీజేపీ నుంచి విడిపోయిన తర్వాతే తనపై ఈడీ సోదాలు జరిగాయని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి వ్యక్తిగత కక్షతో సోదాలు చేయించాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. మరోసారి విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. ఏవైనా పత్రాలు అవసరమైతే సమర్పించడానికి సిద్ధంగా ఉండాలని సూచించిందని వివేక్ మీడియాతో వెల్లడించారు.
Next Story






