మంత్రి పదవిపై వివేక్ వెంకటస్వామి ఫస్ట్ రియాక్షన్

by Ajay Maddhiboyina |

మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంపై చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంక‌ట‌స్వామి స్పందించారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు మంచి అవ‌కాశం వ‌చ్చింద‌ని భావిస్తున్నాన‌ని తెలిపారు. వ్యాపారం చేస్తున్న‌ప్పుడు కూడా త‌న

మంత్రి పదవిపై వివేక్ వెంకటస్వామి ఫస్ట్ రియాక్షన్
X

దిశ‌, వెబ్ డెస్క్: మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంపై చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంక‌ట‌స్వామి స్పందించారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు మంచి అవ‌కాశం వ‌చ్చింద‌ని భావిస్తున్నాన‌ని తెలిపారు. వ్యాపారం చేస్తున్న‌ప్పుడు కూడా త‌న తండ్రి ఆదేశాల మేర‌కు త‌మ చారిటీ నుండి సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించానని చెప్పారు. త‌న తండ్రి ఎన్నో సేవాకార్య‌క్ర‌మాలు చేయ‌డంతో మంచి పేరు ఉంద‌న్నారు. త‌న తండ్రి స్పూర్తితోనే ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేసే అవ‌కాశం వ‌చ్చిందని చెప్పారు.

స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకుని అంద‌రికీ మేలు జ‌రిగేలా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీల అమ‌లుకు కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో క‌లిసి ప‌నిచేస్తామ‌ని తెలిపారు. తెలంగాణ ఉద్య‌మం నుండి తాను ఎలా ప‌నిచేస్తున్నానో పార్టీ హైక‌మాండ్‌కు తెలుసు అని చెప్పారు. ఇదిలా ఉంటే వివేక్‌కు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేదానిపై గత కొన్ని నెలలుగా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఎట్టకేలకు ఆయనకు పదవి దక్కడంతో అభిమానులు, కార్యకర్తలు కుషీ అవుతున్నారు.

Next Story