- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ కార్మికుల పట్ల వాళ్లు శనీశ్వరులు: వేముల వీరేశం ఫైర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని, ఆయన మరోసారి తన కార్మిక పక్షపాతాన్ని చాటుకున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం కొనియాడారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని, ఆయన మరోసారి తన కార్మిక పక్షపాతాన్ని చాటుకున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం కొనియాడారు. శనివారం సీఎల్పీ (CLP) మీడియా సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించిందని వీరేశం తెలిపారు. ఈ విషయంలో చొరవ చూపిన ముఖ్యమంత్రితో పాటు, డిప్యూటీ సీఎం, సంబంధిత మంత్రులు, చర్చల్లో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందనే గొప్ప సందేశాన్ని ఈ నిర్ణయం ద్వారా ఇచ్చారు. ఇటీవల మరణించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల వీరేశం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని, శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
విపక్షాల తీరుపై ధ్వజం..
గత ప్రభుత్వ పాలకులు, ప్రతిపక్ష నేతల తీరును వేముల వీరేశం తీవ్రంగా తప్పుబట్టారు. కొందరు నేతలు ఆర్టీసీ కార్మికులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఆర్టీసీ యూనియన్లకు గౌరవ అధ్యక్షులుగా పనిచేసిన వారు ఇప్పుడు కార్మికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో కార్మికులు సమ్మె చేసినప్పుడు వారిని పట్టించుకోని వాళ్లే ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని, కార్మికుల పట్ల వారు "శనీశ్వరులు"గా వ్యవహరించారని ఘాటుగా వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.






