నోరు తెరిస్తే నోట్లోకి దోమలు.. ఎమ్మెల్యే వినూత్న నిరసన

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లో నోరు తెరిస్తే నోట్లోకి దోమలు పోతున్నాయని.. దోమలతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.

నోరు తెరిస్తే నోట్లోకి దోమలు.. ఎమ్మెల్యే వినూత్న నిరసన
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో నోరు తెరిస్తే నోట్లోకి దోమలు పోతున్నాయని.. దోమలతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్‌లో దోమతెరతో కుట్టించిన గౌన్ ధరించి వినూత్న నిరసనకు దిగారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ హయంలో దోమల బెడద లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని.. దీని ద్వారా డెంగ్యూ, మలేరియాతో పేద ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని అన్నారు. దోమలు అరికట్టలేని ప్రభుత్వం అవసరమా అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేసి మరిన్ని సమస్యలకు కారణం అయ్యారని.. దోమల బెడదకు భయపడి ఎవరూ హైదరాబాద్ రావడం లేదని పేర్కొన్నారు. వెంటనే దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని.. లేదంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు మరింత నష్టం జరిగే అవకాశం ఉన్నదని అన్నారు. ప్రతి డివిజన్‌కు 10 ఫాగింగ్ మిషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story