GHMCలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ని విలీనం చేయాలంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ దీక్ష

by Ajay Maddhiboyina |

జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం చేయాల‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగ‌ణేష్ కార్ఖానాలో రిలే నిరాహార దీక్ష చేప‌ట్టారు. నామినేటెడ్ స‌భ్యుల ప‌దవీ కాలం పొడిగించ‌డంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

GHMCలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ని విలీనం చేయాలంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ దీక్ష
X

దిశ‌, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం చేయాల‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగ‌ణేష్ కార్ఖానాలో రిలే నిరాహార దీక్ష చేప‌ట్టారు. నామినేటెడ్ స‌భ్యుల ప‌దవీ కాలం పొడిగించ‌డంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ఖూనీ చేస్తోంద‌ని ఆరోపించారు. న్యాయం జ‌రిగే వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌ద‌ని గ‌ణేష్ హెచ్చ‌రించారు. కంటోన్మెంట్ అభివృద్ధి ప్ర‌జ‌ల మేలు కోసం విలీనం చేయాల‌ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకువ‌చ్చి రాబోయే ఎన్నిక‌ల్లోనే వీటిని కూడా నిర్వ‌హించేలా ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ రూపొందించిన‌ట్టు ఆయ‌న చెప్పారు. ఇక చాలా కాలంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. కేంద్రం ఆధీనంలోని సికింద్రాబాద్ సివిల్ ప్రాంతాలకు సరిగ్గా నిధులు రాకపోవడంతో చాలా సమస్యలు తలెత్తుతున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని సీహెచ్ఎంసీ ద్వారా నిధులు అందుతాయ‌ని, అభివృద్ధికి స‌రైన ప్రణాళిక రూపొందించ‌వ‌చ్చ‌ని ప్ర‌జ‌లు సైతం భావిస్తున్నారు. అయితే సైనిక భూములకు సంబంధించిన స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ ప్ర‌క్రియ ఆల‌స్యం అవుతోంది.

Next Story