కౌశిక్‌పై SC, ST అట్రాసిటీ కేసు పెట్టాల్సిన అవసరం ఏంటి?: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

by Gantepaka Srikanth |

కోరుట్ల ఎమ్మెల్యే, డాక్టర్ సంజయ్ కుమార్(Dr. Sanjay Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు.

కౌశిక్‌పై SC, ST అట్రాసిటీ కేసు పెట్టాల్సిన అవసరం ఏంటి?: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: కోరుట్ల ఎమ్మెల్యే, డాక్టర్ సంజయ్ కుమార్(Dr. Sanjay Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోటీ పరీక్షలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. గ్రూప్ - 1(Group – 1) అభ్యర్థుల ఆందోళనలపై ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని మండిపడ్డారు. గ్రూప్ - 1 ఫలితాలపై హైకోర్టు(High Court) సందేహాలు వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. గ్రూప్ - 1 ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు ఇచ్చారు. పరీక్ష రాసిన వారికంటే ఎక్కువగా ఫలితాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో 12.61 శాతం మంది ఎంపికయ్యారు. తెలుగు మీడియం విద్యార్థులు 50 మంది కూడా ఎంపిక కాలేదని ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. ఇన్ని అవకతవకలు కనిపిస్తున్నా కూడా ఏమీ పట్టనట్లు.. తమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని నడపటం చేతకావడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగిపోయారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు.

కాగా, గ్రూప్ - 1 నియామక ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Kaushik Reddy) ఆరోపణలు చేశారు. గత నెల 14న తెలంగాణభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి.. గ్రూప్‌-1 పరీక్షల్లో కొంతమంది అభ్యర్థులకు సీక్వెన్స్‌గా ఎక్కువ మార్కులు రావడం, ఓ మాజీ ఎమ్మెల్యే కోడలికి టాప్‌ ర్యాంక్‌ రావడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. దళిత మాజీ ఎమ్మెల్యే కోడలిపై ఆరోపణలు చేయడంతో.. సదరు మాజీ ఎమ్మెల్యే సనత్ నగర్ పీఎస్‌లో కంప్లైంట్ చేశారు. దీంతో పాడి కౌశిక్‌రెడ్డి మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Next Story