- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీనాక్షి నటరాజన్ ఫోన్ సైతం రేవంత్ ట్యాప్ చేయించాడు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్(Phone tapping) దుమారం రేగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్(Phone tapping) దుమారం రేగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తమతోపాటు తమ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటె తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్(AICC Incharge Meenakshi Natarajan) ఫోన్‌ను కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేయించాడని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్(BRS MLA Sanjay Kumar) సంచలన ఆరోపణలు చేసారు. ప్రతిపక్ష నేతల ఫోన్లే కాకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయిస్తున్నారని అన్నారు. పలువురు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటీవల కొన్ని సమావేశాల్లో బహిరంగంగానే రేవంత్ రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేసారని గుర్తు చేసారు.
నిప్పు లేనిదే పొగ రాదని, సొంత పార్టీ నేతలే తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తిరగబడుతుంటే.. ఇక ప్రతిపక్ష నేతల ఫోన్లు మాత్రం ఎందుకు ట్యాప్ చేయకుండా ఉంటారని అన్నారు. రాహుల్ కు అతి సన్నిహితురాలైన మీనాక్షి నటరాజన్ ఫోన్‌ను కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేయించాడని, తనపై రాహుల్ కు ఏం చేరవేస్తుందో అని రేవంత్ కు భయం పట్టుకుందన్నారు.






