- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLA Sanjay: మా పార్టీలోకి వస్తే జీవన్ రెడ్డిని భుజాల మీద మోసుకెళ్తా
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రశంసల జల్లు కురిపించారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రశంసల జల్లు కురిపించారు. శనివారం జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఒకవేళ ఆయన తమ పార్టీలోకి వస్తానంటే 100కు 100 శాతం సాదరంగా ఆహ్వానిస్తానని, అవసరమైతే తానే స్వయంగా వెళ్లి ఆయనను భుజాల మీద ఎక్కించుకుని తీసుకువస్తానని వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి అంటే తనకు వ్యక్తిగతంగా ఎంతో గౌరవం ఉందని, ఆయన చాలా మంచి మనిషి అని సంజయ్ పేర్కొన్నారు.
రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ..
తాను గతంలో వెన్నెముక సర్జరీ చేయించుకున్న సమయంలో, జీవన్ రెడ్డి తమ్ముడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆ సమయంలో ఆయన ఎంతో సాధారణంగా ఒక సామాన్యుడిలా ఆస్పత్రిలో కూర్చుని ఉండటం చూసి తనకు ఆయనపై గౌరవం రెట్టింపు అయిందని గుర్తు చేసుకున్నారు. నేటి కాలంలో గెలిచినా ఓడినా గన్‌మెన్లను కోరుకునే నాయకుల మధ్య, ఏ పదవిలో ఉన్నా లేకపోయినా ఎంతో నిరాడంబరంగా ఉండే జీవన్ రెడ్డి లాంటి వారు రాజకీయాల్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జీవన్ రెడ్డి జీవితంలో 'అవినీతి' అనే పదమే లేదని, అలాంటి వారు రాజకీయాల్లోకి, ముఖ్యంగా తమ పార్టీలోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని సంజయ్ తెలిపారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.






