నన్ను ఎంతో హేళన చేశారు.. CBI కోర్టు తీర్పుపై స్పందించిన MLA సబిత

by Gantepaka Srikanth |

ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసు(Obulapuram Mining Case)లో హైదరాబాద్‌ సీబీఐ కోర్టు(CBI Court) ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ నాయకురాలు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) స్పందించారు.

నన్ను ఎంతో హేళన చేశారు.. CBI కోర్టు తీర్పుపై స్పందించిన MLA సబిత
X

దిశ, వెబ్‌డెస్క్: ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసు(Obulapuram Mining Case)లో హైదరాబాద్‌ సీబీఐ కోర్టు(CBI Court) ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ నాయకురాలు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) స్పందించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థను సంపూర్ణంగా నమ్మాను.. అందుకే తనకు న్యాయం జరిగిందని అన్నారు. ఈ రోజు తనకు న్యాయ వ్యవస్థలపై మరోసారి సంపూర్ణమైన నమ్మకం కలిగిందని చెప్పారు. గత 12 ఏళ్ల పాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ఎమోషనల్ అయ్యారు. ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్లెక్కాల్సి వచ్చిందని తెలిపారు. కేసుల నెపంతో తనను రాజకీయంగా అణచివేయాలనుకున్నారు.. అవినీతి చేశానని, జైలుకు పోతానని హేళన చేశారని అన్నారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.

తాజాగా ఓబుళాపురం మైనింగ్‌ కేసులో ఇవాళ సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం సీబీఐ కోర్టు తుది తీర్పు చెప్పింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ IAS కృపానందంను నిర్దోషులుగా తేల్చింది. మిగిలిన ఐదుగురిని దోషులుగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. ఈ ఐదుగురికి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.

A1గా బీవీ శ్రీనివాస్ రెడ్డి

A2గా గాలి జనార్ధన్ రెడ్డి

A3గా వీడి రాజగోపాల్

A4గా ఓబులాపురం మైనింగ్ కంపెనీ

A7గా మెహాఫస్ అలీఖాన్‌కు ఏడేళ్ల జైలుశిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు.

Next Story