పాకిస్థాన్‌పై దాడి కాదు.. యుద్ధం చేయాలి : ఎమ్మెల్యే రాజాసింగ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-07 10:58:11  IST  )

పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాష్టీకానికి ప్రతీకారంగా.. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరిట ఉగ్రవాదుల్ని చావుదెబ్బ కొట్టిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) అన్నారు. కుటుంబంతో కలిసి సరదాగా గడుపుదామని వెళ్లిన వారిని హిందువులో కాదో నిర్థారించుకుని మరీ చంపినందుకు ఉగ్రవాదులకు దక్కిన ప్రతిఫలమిది అన్నారు.

పాకిస్థాన్‌పై దాడి కాదు.. యుద్ధం చేయాలి : ఎమ్మెల్యే రాజాసింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాష్టీకానికి ప్రతీకారంగా.. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరిట ఉగ్రవాదుల్ని చావుదెబ్బ కొట్టిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) అన్నారు. కుటుంబంతో కలిసి సరదాగా గడుపుదామని వెళ్లిన వారిని హిందువులో కాదో నిర్థారించుకుని మరీ చంపినందుకు ఉగ్రవాదులకు దక్కిన ప్రతిఫలమిది అన్నారు. పహల్గామ్ దాడి జరిగిన రోజే.. భారతీయుల్ని చంపిన టెర్రరిస్టుల్ని వదలబోనని మోదీ సంకల్పం చేశారని, నేడు దానిని నెరవేర్చారని అన్నారు. దాడి సమయంలో ఒక మహిళ తన భర్తను చంపవద్దని ఉగ్రవాదిని ప్రాధేయపడగా.. "వెళ్లి మీ మోడీకి చెప్పుకో" అని అన్న విషయాన్ని గుర్తు చేశారు. మోడీకి చెప్తే వచ్చే రిజల్ట్ అని ఇప్పుడు చూపించారన్నారు. హిందూ మహిళల బొట్టు తీసేస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమేనన్నారు.

భారత సైన్యం చేసిన మెరుపు దాడులపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నా.. ఇలాంటి సమయంలో కేవలం దాడులు మాత్రమే చేస్తే సరిపోదన్నారు. పాకిస్థాన్ ఒక టెర్రరిజం ఫ్యాక్టరీ అని.. పాక్ పై యుద్ధం చేసి మొత్తాన్నీ ఖతం చేయాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. పాక్ నలుమూలల నుంచి టెర్రరిస్టులు తయారవుతున్నారని, ఈ విషయంపై మోడీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.

Read More: PM Modi: ఆపరేషన్ సిందూర్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ

Next Story