నేను కూడా అధ్యక్ష పదవి అడుగుతా: రాజాసింగ్ సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

తెలంగాణ బీజేపీ చీఫ్(Telangana BJP Chief) పదవిపై ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) కీలక వ్యాఖ్యలు చేశారు.

నేను కూడా అధ్యక్ష పదవి అడుగుతా: రాజాసింగ్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ చీఫ్(Telangana BJP Chief) పదవిపై ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను కూడా పార్టీకి విధేయుడిగానే పనిచేశాను.. నేను కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి అడుగుతా’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1995 నుంచి హిందూవాహిని కార్యకర్తగా కొనసాగుతున్నాను. 2009లో మంగళ్‌హాట్ కార్పొరేషన్‌లో సీటు ఇవ్వలేదు. అందుకే టీడీపీ వెళ్లి టికెట్ తెచ్చుకొని గెలిచా అని స్పష్టం చేశారు. ధర్మసేవ కోసం ఎన్నోసార్లు జైలుకు వెళ్లాను అని అన్నారు. తేదీ వచ్చాక నామినేషన్ వేయడంపై నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు.

మరోవైపు.. అధ్యక్ష పదవి కోసం ఎంపీ ఈటల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్ సహా పలువురు నేతలు పోటీ పడుతున్నారనే టాక్ అటు బీజేపీ వర్గాలు, ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కొందరు ఈ పదవి రేసులో తాము లేమని చెబుతున్నా.. లోలోపల మాత్రం తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో ఈ సారి అధ్యక్ష పీఠం ఎవరికి దక్కొచ్చనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

Next Story