బీజేపీ రాష్ట్ర కమిటీలో గోషామహల్ నేతలకు ఎందుకు చోటు లేదు? రాజాసింగ్ హెచ్చరిక

by Ramesh Naini |

రాష్ట్ర బీజేపీ నూతన కమిటీ ఏర్పాటుపై గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్ ​పెదవి విరిచారు.

బీజేపీ రాష్ట్ర కమిటీలో గోషామహల్ నేతలకు ఎందుకు చోటు లేదు? రాజాసింగ్ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర బీజేపీ నూతన కమిటీ (BJP State committee) ఏర్పాటుపై గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) ​పెదవి విరిచారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ రాష్ట్రంలో మూడు సార్లు బీజేపీ గౌరవాన్ని కాపాడిన తన నియోజకవర్గంలో నాయకులు చోటు కల్పించలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానానికి రాష్ట్ర కమిటీలో పనిచేయడానికి తన నియోజకవర్గంలో ఒకరు కనిపించలేదా..? అంటూ ఫైర్​అయ్యారు. 2018 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాదులో ఒకే ఒక్క సీటు గెలిపించిన (Gosha Mahal leaders) గోషామహల్ బీజేపీ కార్యకర్తలు మరిచిపోయారా అంటూ విరుచుకపడ్డారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు మా బీజేపీ కార్యకర్తలను పార్టీకి దూరంగా ఉంచి అన్యాయం చేస్తారో తాను కూడా చూస్తానని హెచ్చరించారు.

Next Story