- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్వతంత్ర ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తా’.. బీజేపీపై మరోసారి రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధిష్టానంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధిష్టానంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ భ్రష్టు పట్టిందని అన్నారు. కొందరు నేతల వల్ల పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతోందని ఆరోపించారు. తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తా అని కీలక ప్రకటన చేశారు. ఇప్పుడు నాకు ఎవరూ బాస్‌లు లేరు, నన్ను ఎవరూ కట్టడి చేయలేరు, అసెంబ్లీలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం వచ్చిందని అన్నారు. తనకు తాను మళ్లీ బీజేపీలో చేరను.. పార్టీ జాతీయ నాయకత్వం పిలిస్తేనే మళ్లీ పార్టీలో చేరుతా అని స్పష్టం చేశారు. కాగా, శనివారం నుంచి తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ పరిశీలించారు.






