- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Raja Singh: పేర్లు చెప్పను.. కానీ వాళ్ళ వల్ల బీజేపీకి చాలా నష్టం జరుగుతోంది
తెలంగాణ బీజేపీ(Telangana BJP)పై గోషామహాల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్(MLA Raja Singh) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP)పై గోషామహాల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్(MLA Raja Singh) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ‘తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాదు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో నా మనిషే అంటే, ఎన్నో ఏళ్ల నుండి ప్రాణం పెట్టి పనిచేసిన పాత కార్యకర్తలు ఎక్కడికి పోవాలి. బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టదు.. వాళ్ళు వేరే రాష్ట్రాలను చూసుకుంటారు. రాష్ట్రంలోని పెద్ద బాబులు చెప్పిందే అధిష్టానం వింటుంది. వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ, వాళ్ళ వల్ల తెలంగాణ బీజేపీకి చాలా నష్టం జరుగుతుంది’ అని రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
కాగా, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావుకు అప్పగించడాన్ని నిరసిస్తూ నిరసనగా రాజాసింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన రాజీనామాను అధిష్టానం కూడా ఆమోదించింది. ఈ వ్యవహారం కమలం పార్టీలో కల్లోలానికి దారితీసింది. దాంతో తరచూ ఆయన పార్టీలో కష్టపడే వారికి న్యాయం జరగడం లేదని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కొంత మంది బీజేపీ నేతలకే ఇష్టం లేదంటూ రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.






