- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘భాగ్యనగర్’ పెట్టినా బాగుండేది.. రహదారికి డొనాల్డ్ ట్రంప్ పేరుపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్‌లో పలు రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో పలు రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు, US కాన్సులేట్ రోడ్డుకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా పేరు, గూగుల్ స్ట్రీట్ పేరుతో మరో రహదారి, మైక్రోసాఫ్ట్, విప్రో జంక్షన్ల పేర్లతో మరికొన్ని రహదార్లకు పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంపై బీజేపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఓ రహదారికి డొనాల్డ్ ట్రంప్ పెడతానన్న రేవంత్ రెడ్డి నిర్ణయంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సోమవారం ఒక వీడియో విడుదల చేశారు.
తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ప్రారంభం అయిందని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రజల సొమ్ము కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును రహదారికి పెట్టాలని నిర్ణయించారని అన్నారు. అయితే ముఖ్యమంత్రికి ఒకటి అడగాలని అనుకుంటున్నా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల పేరు పెట్టకుండా డొనాల్డ్ ట్రంప్ పేరెందుకు..? అని నిలదీశారు. కనీసం దేశం కోసం, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారి పేర్లు పెట్టాలని సూచించారు. నిజాం సర్కార్ సమయంలో భాగ్యనగర్ పేరును తీసేసి హైదరాబాద్ పేరును నామకరణం చేశారు.. భాగ్యనగర్ అని పెట్టినా బాగుండేదని, రేవంత్ జాతీయ వార్తల్లోకి ఎక్కడానికి ట్రంప్ పేరు పెడుతున్నారని విమర్శలు చేశారు.






