- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శబరిమలలో తెలుగు స్వాములకు అవమానం.. ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం
శబరిమలకు వెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లా అయ్యప్ప స్వాములకు అవమానం ఎదురైంది.

దిశ, వెబ్ డెస్క్: శబరిమలకు వెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లా అయ్యప్ప స్వాములకు అవమానం ఎదురైంది. క్యూలైన్ ఎక్కడ అని అడిగినందుకు ఓ కేరళ పోలీస్ అధికారి జిప్ ఓపెన్ చేసి అసభ్యకరంగా సైగలు చేశాడంటూ తెలుగు స్వాములు ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సదరు అధికారిపై వెంటనే చర్యలు తీసుకొవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
కాగా శబరిమల యాత్రలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన స్వాములతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని వచ్చిన వార్తలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు దేవాలయం దర్శించుకోవడానికి వస్తే, వారితో పోలీసులు ఇలా దురుసుగా వ్యవహరించడం అంగీకార యోగ్యం కాదని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఏపీ స్వాములతో అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక కోఆర్డినేటర్ నియామకంపై సీఎంలకు రాజాసింగ్ విజ్ఞప్తి
ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో తెలుగు భక్తులు శబరిమలకు వెళ్తున్న నేపథ్యంలో, వారికి సౌకర్యాలు, మార్గదర్శనం అందించేందుకు ప్రత్యేకంగా ఒక కోఆర్డినేటర్‌ని నియమించాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. భక్తుల సమస్యలు పరిష్కరించేందుకు, శబరిమలలో భాషా అవరోధం లేకుండా సహాయం అందించేందుకు ఈ కోఆర్డినేటర్ ఎంతో అవసరమని ఈ సందర్భంగా రాజాసింగ్ పేర్కొన్నారు.






