తిరుమలలో నమాజ్ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయండి: ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్

by Ramesh Naini |

హిందువుల పవిత్ర ఆలయమైన తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో నమాజ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తిరుమలలో నమాజ్ చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయండి: ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హిందువుల పవిత్ర ఆలయమైన (Tirumala Temple) తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో నమాజ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రముఖ తిరుపతి దేవస్థానంలో దాదాపు 10 నిమిషాల పాటు హజ్రత్ క్యాప్ ధరించి తిరుమల కళ్యాణ మండపంలో ఆ వ్యక్తి నమాజ్ (Person Namaz) చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో నమాజ్ చేసిన వ్యక్తిని కనిపెట్టేందుకు టీటీడీ విజిలెన్స్ విచారణ మొదలు పెట్టింది. అయితే ఈ ఘటనపై బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఒక వీడియో లో మాట్లాడారు. తిరుపతి దేవస్థానం హిందువులకి ఒక పవిత్రమైన ఆలయమని చెప్పారు. గతంలో ఆ దేవస్థానాన్ని అపవిత్రం చేయడానికి చాలా కుట్రలు జరిగాయని అన్నారు. ప్రస్తుతం కూడా అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఏడు కొండలు కాదు.. ఐదు కొండలే నని వైఎస్ఆర్ హయాంలో ప్రచారం జరిగిందని, తర్వాత వైఎస్ జగన్ హయాంలో దేవుడి లడ్డు కల్తీ లాంటి అపవిత్ర ఘటనలు జరిగాయని గుర్తుకు చేశారు. నేడు కొత్తగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి తిరుమల కొండపైన నమాజ్ చేస్తున్న ఒక వీడియో వైరల్ అవుతోందని అన్నారు. తిరుపతి కొండపైకి వెళ్లే సమయంలో మధ్యలో చెక్‌పోస్టులు ఉంటాయని, ఒక ఎమ్మెల్యే ఉంటే కూడా వాహనాన్ని, సామాన్లను పూర్తిగా చెక్ చేస్తారని తెలిపారు. అయితే తిరుపతి దర్శనానికి వచ్చే భక్తుల డ్రైవర్ల ఐడీ కార్డును తనిఖీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒక వేల డ్రైవర్ ముస్లిం, క్రిస్టియన్ ఉంటే వెంటనే అతన్ని అక్కడి నుంచే పంపించాలని సూచనలు జారీ చేశారు. వేరే మతస్తుల డ్రైవర్స్ ఉంటే తిరుమల కొండపైకి ఎంట్రీ లేదని ప్రచారం చేయాలని టీటీడీకి రిక్వెస్ట్ చేశారు.

Next Story