అలిగిన ప్రేమ్ సాగర్ రావు.. కాంగ్రెస్ నేతల సమావేశం నుండి వాకౌట్

by Ajay Maddhiboyina |

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగ‌ర్ రావు తాజ్ కృష్ణాలో జ‌రిగిన నేత‌ల స‌మావేశం నుండి అలిగివెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ఆయ‌న‌కు ప్ర‌భుత్వ విప్ ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ వెళ్లిపోయినట్టు స‌మాచారం.

అలిగిన ప్రేమ్ సాగర్ రావు.. కాంగ్రెస్ నేతల సమావేశం నుండి వాకౌట్
X

దిశ, వెబ్ డెస్క్: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగ‌ర్ రావు తాజ్ కృష్ణాలో జ‌రిగిన నేత‌ల స‌మావేశం నుండి అలిగివెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఈ సమావేశానికి హాజరై పదవులు ఆశించి భంగపడ్డ నేతలతో మాట్లాడారు. కాగా ఈ సమావేశం నుండి ప్రేమ్ సాగర్ రావు వెళ్లిపోయినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ఆయ‌న‌కు ప్ర‌భుత్వ విప్ ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. భ‌ట్టి బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ప్రేమ్ సాగ‌ర్ రావు అక్క‌డ నుండి వెళ్లిపోయార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ప్రేమ్ సాగ‌ర్ ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌న‌కు ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆశించారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది నేత‌లు పార్టీలు మారిన‌ప్ప‌టికీ ఆయ‌న కాంగ్రెస్‌లోనే కొనసాగారు. పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లాలో కాంగ్రెస్ విజయంలో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని చాలా కాలం నుండి ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబంలో ముగ్గురికి టికెట్లు ఇవ్వడంతో ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి పక్కా అంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ చివరి నిమిషంలో మంత్రి పదవి వివేక్ వెంకట స్వామికి దక్కింది. అప్పటి నుండి ప్రేమ్ సాగర్ రావు అలిగినట్టు తెలుస్తోంది.

Next Story