ఆ జీవోను తక్షణమే రద్దు చేయండి : ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఆమరణ నిరాహార దీక్ష

by Muthe.Rajitha |

జీ.ఓ. నెంబర్ 49 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

ఆ జీవోను తక్షణమే రద్దు చేయండి : ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఆమరణ నిరాహార దీక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : జీ.ఓ. నెంబర్ 49 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా, శాస్త్రీయమైన పద్ధతిని అనుసరించకుండా, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని హరీష్ బాబు మండిపడ్డారు. గత మే 30న ప్రభుత్వం అక్రమంగా తీసుకువచ్చిన జీ.ఓ. నెంబర్ 49 ను తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని పేర్కొన్నారు.

తడోబా రిజర్వు ఫారెస్ట్ ను కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లో కలుపుతూ కొమరం భీం అసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్ పరిధిలోని 334 గ్రామాలను రిజర్వు ఫారెస్ట్ గా పేర్కొంటూ తీసుకువచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిగొచ్చి జీ.ఓ. నెంబర్ 49 ను రద్దు చేసేంతవరకు బీజేపీ పోరాటం సాగుతుందని హరీష్ రావు స్పష్టం చేసారు.

Next Story