- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP MLA: పలకలేని ఊరు పేరుతో కష్టాలు.. మార్చాలి అని ఎమ్మెల్యే డిమాండ్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. కాగజ్‌నగర్ మండలంలో ఉన్న ఓ గ్రామం పేరుపై సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ గ్రామం పేరు రెవెన్యూ రికార్డుల్లో ల*జగూడగా ఉండటంతో, ఉచ్చరించడానికే ఇబ్బందిగా ఉందన్నారు. కాగజ్‌నగర్‌కు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గ్రామం పేరు వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామస్తులు ఇప్పటికే ఆ ఊరు పేరును నందిగూడగా మార్చుకున్నారని, అదే విధంగా రెవెన్యూ రికార్డుల్లో కూడా పేరు మార్పు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పలకడానికి ఇబ్బందిగా ఉన్న ఊరు పేరు మార్చాల్సిన అవసరం ఉందని అసెంబ్లీలో స్పష్టంగా డిమాండ్ చేశారు.
జైనాథ్‌పూర్ ప్రాజెక్టు పూర్తి చేయాలి
అదే విధంగా జైనాథ్‌పూర్ ప్రాజెక్టుపై కూడా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిధుల పరంగా ఎలాంటి సమస్య లేదని, ముఖ్యమంత్రి మరియు సంబంధిత మంత్రిని కలిసినా ఫైళ్లు కదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జైనాథ్‌పూర్ ప్రాజెక్టు పూర్తయితే రెండు మండలాలకు సాగునీరు అందుతుందని, దీని ద్వారా రైతులకు భారీ లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే సభలో వివరించారు.






