- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు మేజర్ ఆపరేషన్ జరిగింది..ఆస్పత్రి నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వీడియో
by Ajay Maddhiboyina |
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ నెల11న ప్రమాదవశాత్తు బాత్ రూంలో కాలు జారి కిందపడిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ నెల11న ప్రమాదవశాత్తు బాత్ రూంలో కాలు జారి కిందపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.కాగా తాజాగా ఆయన ఆస్పత్రి నుండి ఓ వీడియోను విడుదల చేశారు. నాలుగు గంటల పాటు తనకు మేజర్ ఆపరేషన్ జరిగిందని చెప్పారు. అందరి దయ వల్ల కోలుకుంటున్నానని అన్నారు.
జనగామ నుండి తనను కలవాలని వస్తున్నారని కానీ రెండు వారాల పాటు డాక్టర్లు విశ్రాంతి అవసరం అని చెప్పారన్నారు. మేజర్ ఆపరేషన్ జరగడం వల్ల వారం వరకు తన వద్దకు రావద్దని కోరారు. లేచి నిలబడే వరకు తన వద్దకు రావద్దని అన్నారు. మరో రెండు వారాలు తనకు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించినట్టు తెలిపారు. అందరి ప్రేమ అభిమానాలు ఇలానే ఉండాలని కోరుకున్నారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






