BIG BREAKING : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-21 00:15:16  IST  )

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Koushik Reddy Arrest)ని పోలీసులు అరెస్ట్ చేశారు.

BIG BREAKING : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Koushik Reddy Arrest)ని పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో.. కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వరంగల్ లోని సుబేదారి పోలీస్ స్టేషన్ (Subedari Policestation)కు తరలించారు. అనంతరం ఆయనపై భారతీయ శిక్షా స్మృతి (BNS)లోని సెక్షన్ 308 (2), 308 (4), 352 కింద కేసులు నమోదు చేశారు. ఉదయం కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించనున్నారు.

సుబేదారి పీఎస్ లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని నాలుగు క్రితం హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి చుక్కెదురయింది. కమలాపురం మండలం వంగపల్లిలో ఉన్న క్వారీని మనోజ్ నిర్వహిస్తున్నాడు. అయితే తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఆ కేసును కొట్టివేయాలని ఏప్రిల్ లో పిటిషన్ దాఖలు చేయగా.. సోమవారం (జూన్ 16) విచారించిన కోర్టు.. దానిని కొట్టివేసింది. గతంలో ఇదే కేసులో అరెస్ట్ పై స్టే ఇచ్చిన కోర్టు.. దర్యాప్తుకు సహకరించాని ఆదేశించింది.

Next Story