- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CS రామకృష్ణారావును కలిసిన పాడి కౌశిక్‌రెడ్డి
హుజూరాబాద్ సమీపంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయవద్దని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సీఎస్ రామకృష్ణారావుకు విజ్ఞప్తి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ సమీపంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయవద్దని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సీఎస్ రామకృష్ణారావుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వినతిపత్రం అందించారు. డంపింగ్ యార్డు ఏర్పాటుతో హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యంతోపాటు తీవ్ర కాలుష్యం ఏర్పడుతుందని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని సిరిసపల్లి గ్రామంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్న డంపింగ్ యార్డ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పంట పొలాలు, సాగునీరు, తాగునీటి వనరులు, వాతావరణం తీవ్రంగా ప్రభావితమవుతాయని, స్థానిక ప్రజల జీవన విధానం దెబ్బతింటుందని పేర్కొన్నారు. వెంటనే డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను రద్దు చేయాలని సీఎస్‌ను కోరారు. అలాగే.. మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో నిర్మించాల్సిన కల్వల ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు రూ.70 కోట్ల వ్యయంతో డీపీఆర్‌లు సిద్ధం చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం పనులు ప్రారంభించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నియోజకవర్గంలో 6వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు సాగునీరు, తాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వీటితోపాటు పలు సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు.






