MLA Nayini : ఎమ్మెల్యే నాయిని వివాదస్పద వ్యాఖ్యలు!

by Y. Venkata Narasimha Reddy |

గ్రామ సభ(Gram Sabha)ల్లో ఇల్లు రాలేదని.. రేషన్ కార్డు రాలేదని గొడవ చేస్తే(Protests) తోలు తీస్తా..చెట్టుకు కట్టేసి కొడుతాన(Beaten)ని వరంగల్ పశ్చిమ(Warangal West)ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy) చేసిన హెచ్చరికలు వివాదస్పదమ(Controversial Comments)య్యాయి.

MLA Nayini : ఎమ్మెల్యే నాయిని వివాదస్పద వ్యాఖ్యలు!
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రామ సభ(Gram Sabha)ల్లో ఇల్లు రాలేదని.. రేషన్ కార్డు రాలేదని గొడవ చేస్తే(Protests) తోలు తీస్తా..చెట్టుకు కట్టేసి కొడుతాన(Beaten)ని వరంగల్ పశ్చిమ(Warangal West)ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy) చేసిన హెచ్చరికలు వివాదస్పదమ(Controversial Comments)య్యాయి. బీఆర్ఎస్ వాళ్లు కొంత మంది గ్రామసభల్లో ప్రజలను రెచ్చగొట్టి, తప్పుదోవ పట్టించి రగడ సృష్టస్తూ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు ఆటంకం కల్గిస్తున్నారని ఆరోపించారు.

రాజకీయ నేపథ్యంలో సృష్టిస్తున్న వివాదాలతో గ్రామసభల్లో లబ్ధిదారులుగా ఎంపిక కావాల్సిన పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. పేదల జీవితాలను ఆగం చేస్తే సహించేది లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం ఒక్కోటిగా అమలు చేస్తు ముందుకెలుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఇస్తే ఓర్వలేక ఆటోవాళ్లను రెచ్చగొట్టారని, ఇప్పుడు జనవరి 26నుంచి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ పథకం సహాయం అందిస్తుంటే ఓర్వలేక గ్రామసభలను అడ్డుకుంటుందన్నారు.

అసలు గ్రామసభలకు వచ్చి జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయో లేదో చూసుకుని, అవసరమైతే మళ్లీ దరఖాస్తులు చేసుకోమని ప్రభుత్వం చెబితే..కొందరు వెధవలు మాత్రం ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలంటూ అడుగుతున్నారని నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గ్రామసభల్లో ప్రశ్నిస్తే చెట్టుకు కట్టేసి కొడుతానంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇదేం దౌర్జన్యం అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Next Story