ముందు సక్కగా లేని మీ కుటుంబ పరిస్థితి చూసుకో..కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

by Ajay Maddhiboyina |

మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. అడినవాటికి సమాధానం చెప్పాలని కేసీఆర్‌ను రమ్మంటే మధ్యలో వచ్చి 72 గంటలు టైం ఇస్తున్నావంటూ మండిపడ్డారు.

ముందు సక్కగా లేని మీ కుటుంబ పరిస్థితి చూసుకో..కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
X

దిశ‌, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. అడినవాటికి సమాధానం చెప్పాలని కేసీఆర్‌ను రమ్మంటే మధ్యలో వచ్చి 72 గంటలు టైం ఇస్తున్నావంటూ మండిపడ్డారు. 72 గంటలకు టైం ఇవ్వడం కాదు నువ్వు ఇచ్చిన హామీ గురించి చర్చకు రావాలని, నయీంనగర్ బ్రిడ్జ్ వద్దకు వస్తా.. నువ్వు కూడా రా అంటూ సవాల్ చేశారు. ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీది కాదని ముందు మీ కుటుంబం పరిస్థితి చూసుకోవాలని కామెంట్ చేశారు. ఎవ‌రు ఎవ‌రి కాళ్లు గుంజుకుంటున్నారో అర్థం కావ‌డం లేద‌ని, అవ‌న్నీ వ‌దిలేసి మిగితా విష‌యాలు మాట్లాడుతున్నాడ‌ని అన్నారు. ప్ర‌జ‌లు తిర‌స్క‌రించినా మీకు బుద్ధి రావ‌డం లేదు అంటూ మండిప‌డ్డారు. వ‌చ్చీ రాని మాట‌లు మాట్లాడ‌కూద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ నాయ‌కులు చెట్టుకొక‌రు పుట్ట‌కొక‌రు అయ్యారని, జైళ్ల‌కు పోతున్నార‌ని విమ‌ర్శించారు. యూట్యూబ్ ఛాన‌ళ్లు పెట్టుకుని ఇది చేస్తాం అది చేస్తాం అంటే కుద‌రదు అని హెచ్చ‌రించారు.

Next Story