అవసరమైతే సిట్ విచారణకు కేసీఆర్‌ను కూడా పిలుస్తారు: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

by Ajay Maddhiboyina |

ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకునే అవకాశం లేదు..కేసుపైన భయం లేకపోతే మంది మార్బలంతో విచారణకు ఎందుకు కేటీఆర్ వెళ్లాడు? చట్టం తన పని తాను చేసుకు పోతుంది.

అవసరమైతే సిట్ విచారణకు కేసీఆర్‌ను కూడా పిలుస్తారు: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకునే అవకాశం లేదు..కేసుపైన భయం లేకపోతే మంది మార్బలంతో విచారణకు ఎందుకు కేటీఆర్ వెళ్లాడు? చట్టం తన పని తాను చేసుకు పోతుంది..ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ దగ్గర పడిందని భావిస్తున్నట్లు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన సీఎల్పీ మీడియా సెంటర్ లో మీడియాతో మాట్లాడుతూ ఇంటి అల్లుడు ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారని కవిత అడిగిన ప్రశ్నకు సమాధానం ఏది? కల్వకుంట్ల కుటుంబం దుర్మార్గులు అన్ని బయటకు వస్తాయి..సిట్ దర్యాప్తు కు అవసరమైతే కేసీఆర్ ను కూడా విచారణకు పిలుస్తారన్నారు. క్యారెక్టర్ ను దెబ్బతీస్తున్నామని కేటీఆర్ అంటున్నాడు..కేటీఆర్ కథలు అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి ఓపిక వల్లనే బీఆర్ఎస్ నాయకులు బతికి బట్ట కడుతున్నారని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ కి డిపాజిట్లు రావు అని, సానుభూతి చూపకుండా విచారణ చేసి లోపలికి పంపాలన్నారు.

ఫోన్ ట్యాపింగ్ విచారణ జరగకుండా అమెరికా పారిపోయారు..కేటీఆర్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు.. ఏదో పోరాటయోధుడు ని, నాకు వీర తిలకం దిద్దండి అన్నట్లు కేటీఆర్ హడావిడి చేశారన్నారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన పాపాలకు మరో పదేళ్లు విచారణ చేసినా సమయం సరిపోదు..రింగ్ రోడ్డు కానుంచి అనేకం అమ్ముకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. అధికారానికి ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని..ఇప్పుడెన్ని.? 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి లేని ఆస్తులు 25 ఏళ్ల బీఆర్ఎస్ కు ఎలా వచ్చాయని నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. బావ బావమరిది ప్రభుత్వ అధికారులను తిడుతున్నారు..బెదిరిస్తున్నారు..దొంగ యూట్యూబ్ ఛానల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సిట్ కేవలం నోటీసులు ఇస్తేనే బట్టలు చింపుకుంటున్నారు..మీరు అధికారంలో ఉన్నప్పుడు మా రేవంత్ రెడ్డిని బెడ్ రూమ్ నుంచి ఎత్తుకు పోయారు..కోదండరాం, మందకృష్ణ మాదిగ, బండి సంజయ్ లాంటి వారిని తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేశారు..ఇలాంటి వారిని రోడ్ మీద వదిలకూడదని..మా సీఎంని అడుగుతున్నా.. ఇలాంటి వారిపైన సానుభూతి చూపించొద్దు..రౌడీ షీట్లు ఓపెన్ చేసి జైలుకు పంపించాలి.

అధికారులను బెదిరించే వాళ్లను వదలొద్దు..డీసీపీ స్థాయి అధికారులను బెదిరిస్తున్నారని, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను రాష్ట్రంలో లోకి రానివ్వ లేదని నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. అందరిని బెదరించారు..పదేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చని బీఆర్ఎస్ కు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు..పైకి మాత్రం ఏమీ లేదని తిరుగుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు మీరు చెప్పింది నమ్మరు..రాహుల్ గాంధీ పైన మాట్లాడితే ..బిడ్డా వదిలిపెట్టను..130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కి పేపర్, టీవీ లు లేవు..బీఆర్ఎస్ కు ఎలా వచ్చాయని నాయిని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లాలను రద్దు చేస్తామని ఎవరూ చెప్పలేదని, పునర్విభజన పేరుతో వరంగల్ జిల్లాను సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. వరంగల్ జిల్లా అని గర్వం గా చెప్పుకున్నాం..వరంగల్ కు మిగిలిన సెంట్రల్ జైల్ ను కూడా నాశనం చేశారు.. జిల్లాలు రద్దు అని మున్సిపల్ ఎలక్షన్ కోసం బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారు..ప్రజలను రెచ్చగొట్టి బతకడమే బీఆర్ఎస్ నాయకులకు పనిగా మారిందని నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Next Story