Medipally: చెల్లె కవిత మాటలకు సమాధానం చెప్పలేని చవట.. కేటీఆర్‌పై మేడిపల్లి సత్యం ఫైర్

by Ramesh Naini |

చెల్లె కవిత మాటలకు సమాధానం చెప్పలేని చవట దద్దమ్మ కేటీఆర్.. అంటూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ అయ్యారు.

Medipally: చెల్లె కవిత మాటలకు సమాధానం చెప్పలేని చవట.. కేటీఆర్‌పై మేడిపల్లి సత్యం ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చెల్లె కవిత మాటలకు సమాధానం చెప్పలేని చవట దద్దమ్మ (KTR) కేటీఆర్.. అంటూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (MLA Medipalli Satyam) ఫైర్ అయ్యారు. గురువారం ఆయన సీఎల్పీ మీడియా సెంటర్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రానికి పట్టిన శనిగా కేటీఆర్ దాపురించాడని విమర్శించారు. పొద్దున్న లేస్తే అపశకునం మాటలు తప్ప ఆయన నోటి నుంచి ఇంకొకటి రావడం లేదన్నారు. ప్రజలను రెచ్చగొట్టి బతకాలని కేటీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు మంచి జరిగితే తన రాజకీయ జీవితం ముగిసిపోతుందన్న భయంతో కేటీఆర్ ఉన్నారని అన్నారు. రాజకీయ విమర్శలను మేం ఆహ్వానిస్తాం.. కాని కేటీఆర్ చేసేవి నీచమైన ఆరోపణలు అని అన్నారు. కేటీఆర్ చెప్పే పాచిపోయిన కబుర్లను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు.

(L&T)ఎల్అండ్‌టీని బెదిరించామని కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఎల్‌అండ్‌టీ వాళ్లు ఎవరైనా కేటీఆర్‌కు చెప్పారా..? అని ప్రశ్నించారు. గతంలో బేగం బజార్ నుంచి మెట్రో లైన్ వెళ్లకుండా ఆపింది కేసీఆర్ కాదా..? అని నిలదీశారు. పదేళ్ల పాటు బెదిరించి బతికింది ఎవరో అందరికీ తెలుసన్నారు. సెటిలర్లు, వ్యాపారవేత్తలు, చివరకు ఉద్యమకారులను కూడా బెదిరించి బీఆర్ఎస్ బతికిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఏదో పొడుస్తామని కేటీఆర్ తెగ డబ్బా కొడుతున్నారని, దమ్ముంటే జూబ్లీహిల్స్ గెలుపు పైన సవాల్ విసరాలని చాలెంజ్ చేశారు. జూబ్లీహిల్స్ లోనే కాదు రాష్ట్రంలోనే బీఆర్ఎస్ కథ ముగిసిందన్నారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు కనీసం 50 వేల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ సంక్షేమ పథకాలతో అక్కడి ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. మైనార్టీలు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ‘అచ్చా చావల్’ ఇస్తున్నారని మెచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రంలో సంతోషంగా లేనిది కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమేనని అన్నారు.

Next Story