కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

by Muthe.Rajitha |

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తృటిలో ప్రమాదం తప్పింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తృటిలో ప్రమాదం తప్పింది. కారు ప్రమాదంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెద్దపల్లి జిల్లా చొప్పదండి నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యానికి పెను ప్రమాదం తప్పినట్టైంది. కాగా ఎమ్మెల్యే కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్తుండగా.. కాన్వాయ్ లోని ముందు కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో వెనకాల వస్తున్న కాన్వాయ్ లోని కార్లు కూడా ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. వెంటనే కార్లలోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. అయితే ఈ ప్రమాదంలో కార్లు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నట్టు సమాచారం.

Next Story