TG: జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి: MLA కూనంనేని డిమాండ్

by Gantepaka Srikanth |

స్ ఛానల్‌పై బీఆర్ఎస్(BRS) కార్యకర్తల దాడిని సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) తీవ్రంగా ఖండించారు.

TG: జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి: MLA కూనంనేని డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: మహా టీవీ న్యూస్ ఛానల్‌పై బీఆర్ఎస్(BRS) కార్యకర్తల దాడిని సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఛానల్ ప్రధాన కార్యాలయంలో జర్నలిస్టులు పని చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద పెద్ద రాళ్ళతో విధ్వంసానికి పాల్పడటం, బీభత్సం సృష్టించడం దుర్మార్గమని అన్నారు. ఇది ముమ్మాటికీ మీడియా స్వేచ్ఛపై తీవ్రమైన దాడి అని వ్యాఖ్యానించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కూనంనేని డిమాండ్ చేశారు.

Next Story