MLA Koushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఊరట.. బంజారాహిల్స్ పోలీసుల కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

హుజూరాబాద్ బీఆర్ఎస్‌ (BRS) ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Koushik Reddy)కి కాస్త ఊరట లభించింది.

MLA Koushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఊరట.. బంజారాహిల్స్ పోలీసుల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ బీఆర్ఎస్‌ (BRS) ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Koushik Reddy)కి కాస్త ఊరట లభించింది. బంజారా‌హిల్స్ (Banjara Hills) సీఐ విధులకు ఆటంకం కలిగించారనే కేసులో విచారణ జనవరి 6కు వాయిదా పడింది. కాగా, ఈ కేసుకు సబంధించి ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణ రావాలంటూ పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే, తన తండ్రి హార్ట్ సర్జరీ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని పోలీసులకు తెలిపారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు జనవరి 6కు విచారణను వాయిదా వేశారు. అదేవిధంగా ఈ కేసులో కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో సహా మరో 20 మంది అనుచరులను పోలీసులు నిందితులుగా చేర్చారు.

Next Story