- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగ యువతకు అండగా నేనుంటా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
నిరుద్యోగ యువత సమస్యల్ని వినేందుకు సిటీ సెంట్రల్ లైబ్రరీ (City Central Library), అశోక్ నగర్ కు వస్తానన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగ యువత సమస్యల్ని వినేందుకు సిటీ సెంట్రల్ లైబ్రరీ (City Central Library), అశోక్ నగర్ కు వస్తానన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం (Prajapalana Dinotsav) సందర్భంగా గన్ పార్క్ (Gun Park) వద్ద అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగుల నిరసనలకు తన మద్దతు ఉంటుందన్నారు. వారి సమస్యల్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అలాగే గ్రూప్ -1 పరీక్షలు, నియామకాల్లో జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వారంతా ఉన్న లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. నిరుద్యోగ యువతకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చెప్తున్నా.. ఎవరూ అధైర్య పడవద్దన్నారు. నిరుద్యోగ యువత కన్న కలలు, ఆకాంక్షలు, ఆశయం కోసం వారి వెన్నంటే ఉంటానని మాట ఇస్తున్నాన్నారు. ఉద్యోగాల భర్తీ ఆలస్యమైన మాట వాస్తవమేనని, రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవ్వగా.. దానిని గాడిన పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.






