మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి యూటర్న్

by Gantepaka Srikanth |

మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి యూటర్న్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు శాశ్వతం కాదు.. మునుగోడు అభివృద్ధే తన లక్ష్యమన్నారు. తనకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు.. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ఇటీవల మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని, లేకుంటే సీఎం పోస్టు కోసం ప్రయత్నిస్తానని అన్నారు. మళ్లీ అడగబోను అని.. నాకూ ఒకరోజు వస్తుందని.. ఆ రోజు లాక్కుంటానని అన్నారు. దీంతో పాటు పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం చేసిన వ్యాఖ్య అధిష్టానాన్ని అవమానించడమే అంటూ ఆయన మండిపడ్డారు. సీఎం ఒక్కరే కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని, పార్టీలో నేతలంతా శ్రమించారని ఆయన గుర్తుచేశారు.ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చంశనీయమయ్యాయి.

Next Story