బీజేపీ పదాధికారుల సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి సంచలన వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరిగింది.

బీజేపీ పదాధికారుల సమావేశంలో ఎమ్మెల్యే కాటిపల్లి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం (BJP state office)లో పదాధికారుల సమావేశం జరిగింది. ఇందులో 15 జడ్పీ స్థానాలతో పాటు, జూబ్లీహిల్స్ లో విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchandra Rao) దిశానిర్ధేశం చేశారు. అయితే గత కొంత కాలంగా పార్టీలో ఉన్న వివిధ సమస్యలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (MLA Katipally Venkataramana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై కాటిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయ లోపం ఏర్పడిందని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ ఆఫీస్‌లో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేస్తారు కానీ.. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని, సమావేశాలకు రావడం, వెళ్లడమే మా పనా?.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఏవని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఫైర్ అయినట్లు తెలుస్తుంది. మరోపక్క చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (MP Konda Vishweshwar Reddy) సైతం జిల్లా ఇంఛార్జులపై తీవ్ర అసహనం వ్యక్తం చేయగా.. సమస్యల పరిష్కారానికి కమిటీ వేద్దామని, బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ చెప్పినట్లు తెలుస్తుంది.

Next Story