- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాద స్థలికి వెళ్లిన ఎమ్మెల్యే కాలే యాదయ్య.. ఆగ్రహంతో తిరగబడిన ప్రజలు
చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ బస్సు ప్రమాదం రాష్ట్ర ప్రజలను శోకసంద్రంలో ముంచేసింది.

దిశ, వెబ్‌డెస్క్: చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ బస్సు ప్రమాదం రాష్ట్ర ప్రజలను శోకసంద్రంలో ముంచేసింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 21 మంది ప్రాణాలో కోల్పోగా.. అందులో 12 మంది మహిళలు ఓ చిన్నారి కూడా ఉంది. అయితే, తాజాగా ఘటనా స్థలానికి చేవెళ్ల కాలే యాదయ్య (Kale Yadaiah) వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయనపై స్థానికులు తిగరబడ్డారు. ఎమ్మెల్యే డౌన్.. డౌన్ అంటూ ఏకంగా చేతుల్లో రాళ్లు అందుకుని దాడి చేయబోయారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఆలస్యంగా ఇంత మంది ప్రాణాలు పోయాయని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం పాలకులేనని మండిపడ్డారు. హైదరాబాద్ - బీజాపూర్ రహదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ప్రమాదం జరగగానే వచ్చి చూసిపోవడానికి ఎమ్మెల్యే వచ్చాడంటూ అక్కడున్న వారు ఎమ్మెల్యేపైకి ఒక్కసారిగా తిగరబడ్డారు. దీంతో అక్కడే పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను అడ్డుకోగా వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం చేసేది ఏం లేక ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రమాద స్థలంలో కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read More.. ' మృతుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి '






