నేను పార్టీ మారలేదు: కడియం శ్రీహరి

by Gantepaka Srikanth |

నేను పార్టీ మారలేదు: కడియం శ్రీహరి

నేను పార్టీ మారలేదు: కడియం శ్రీహరి
X

దిశ, వెబ్‌డెస్క్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) స్పందించారు. బుధవారం స్పీకర్‌కు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరలేదని స్పష్టం చేశారు. పార్టీ మారాను అనేది పచ్చి అబద్ధం అని పేర్కొన్నారు. కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన చెందారు. కాగా, కాసేపటి క్రితమే పార్టీ మారిన ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ తీర్పు వెలువరించారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలు చూపలేకపోయారని తీర్పులో పేర్కొన్నారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నట్టు స్పష్టం చేశారు.

Next Story