అశోక్‌నగర్ పేరు వింటేనే ఈ సీఎంకు భయం: మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి

by Ajay Maddhiboyina |

ఇంతటి అబద్ధాల ముఖ్యమంత్రిని తాను ఎప్పుడూ చూడలేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన విద్యార్థి నేత కొమ్మనబోయిన సైదులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

అశోక్‌నగర్ పేరు వింటేనే ఈ సీఎంకు భయం: మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంతటి అబద్ధాల ముఖ్యమంత్రిని తాను ఎప్పుడూ చూడలేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన విద్యార్థి నేత కొమ్మనబోయిన సైదులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1969 తెలంగాణ ఉద్యమం, మలి దశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో విద్యార్థులకు హామీలు ఇచ్చి మోసం చేసిందని పేర్కొన్నారు. అశోక్‌నగర్ పేరు వింటే రేవంత్‌రెడ్డికి భయం అవుతుందని ఆరోపించారు.

అశోక్‌నగర్ హోటల్ మెట్ల ముందు రాహుల్‌గాంధీని కోర్చోబెట్టారని.. నేడు అదే ఏరియాలో 144 సెక్షన్ పెట్టారని అన్నారు. 200 మంది గురుకులాల విద్యార్థులను పొట్టన బెట్టుకున్న ఏకైక సీఎం, విద్యా శాఖ మంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన కరెంటు, నీళ్లు ఇవ్వడం ఈ సీఎంకు ఇష్టం లేదని.. రైతుల ఉచిత విద్యుత్‌కు ఉరి వేసే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసి, మోటార్లకు మీటర్లు పెట్టే డిస్కంను తెస్తున్నారని అన్నారు. ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌ను ప్రయివేటు వారికి అప్పగించడమే వీరి లక్ష్యమని.. అందులో సీఎం సోదరుడికి లేదా డిప్యూటీ సీఎంకు, ఇంకో మంత్రికి వాటాలు ఉంటాయని ఆరోపించారు. మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

Next Story