- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: రాష్ట్రంలో సంచలన ఘటన.. యూరియాను పక్కదారి పట్టించిన ఎమ్మెల్యే గన్ మెన్
‘నేను ఎమ్మెల్యే గన్‌మెన్‌ను. ఓ లారీ లోడ్ యూరియా నాకు కావాలి’ అంటూ వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి.. పక్కా ప్లాన్‌తో యూరియాను పక్కదారి పట్టించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, మిర్యాలగూడ: ‘నేను ఎమ్మెల్యే గన్‌మెన్‌ను. ఓ లారీ లోడ్ యూరియా నాకు కావాలి’ అంటూ వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి.. పక్కా ప్లాన్‌తో యూరియాను పక్కదారి పట్టించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూరియా కొరతను ఆసరాగా తీసుకుని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్ మెన్ నాగు నాయక్ ఒక లోడ్ యూరియాను పక్కదారి పట్టించాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఫోన్ చేశారు. రైతులకు యూరియా సకాలంలో అందించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు అధికారులకు అసలు విషయం చెప్పారు. ‘మీ గన్‌మెన్ మాకు ఫోన్ చేసి లారీ యూరియాను తీసుకున్నాడు సార్’ అని ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో షాకైన ఎమ్మెల్యే గన్‌మెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ గన్‌మెన్ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు పోలీసులు పేర్కొన్నారు.






