Danam Nagender: అనర్హత పిటిషన్ కొట్టివేతపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2026-03-11 05:50:33  IST  )

పార్టీ ఫిరాయింపు, అనర్హత పిటిషన్ కొట్టివేతపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.

Danam Nagender: అనర్హత పిటిషన్ కొట్టివేతపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి పై అనర్హత పిటిషన్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ అంశంపై బుధవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పరిధిలో నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ నన్ను వివరణ అడగలేదని దానం వెల్లడించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా వివరణ అడగలేదన్నారు. నాపై పిటిషన్ వేసిన వాళ్లకు ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. నాకు ఎప్పుడూ విప్ జారీ చేయలేదని, పార్టీకి వ్యతిరేకంగా నేను పనిచేయలేదని దానం అన్నారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ తీర్పు ఇచ్చారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారినట్లు మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గతంలో ఎనిమిది మందికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్.. తాజాగా దానం, కడియం శ్రీహరికి క్లీన్ చిట్ డిక్లేర్ చేశారు.

BIG BREAKING: కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు బిగ్ రిలీఫ్

Next Story