- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పనులు అవ్వాలంటే సీఎంను కలవాల్సిందే.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ప్రజల కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. నేరుగా రెండు సార్లు విచారణకు హాజరయ్యానని చెప్పారు. తనను అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఇచ్చానని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే ప్రభుత్వ పెద్దలను కలిశానని తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రజల కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. నేరుగా రెండు సార్లు విచారణకు హాజరయ్యానని చెప్పారు. తనను అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఇచ్చానని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే ప్రభుత్వ పెద్దలను కలిశానని తెలిపారు. నియోజకవర్గంలో పనులు కావాలంటే తప్పకుండా సీఎంను వెళ్లి కలవాల్సిందే అని వ్యాఖ్యానించారు. ఒక పార్టీలో ఉండి ముఖ్యమంత్రితో కలవకపోతే నియోజకవర్గం అభివృద్ధి 30 ఏళ్లు వెనకు వెళ్లిపోతుందని అన్నారు.
వ్యక్తిగత పనుల కోసం తానెప్పుడు సీఎంను కలవలేదని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఓట్లు వేస్తారని చెప్పారు. పార్టీ ఫిరాయింపు వ్యవహారం అనేది పూర్తిగా స్పీకర్ చేతిలో ఉందని అన్నారు. స్పీకర్ తీర్పు తనకు అనుకూలంగానే ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. తన భవిష్యత్ అభివృద్ధి అజెండాతో సాగే పార్టీతోనే ఉంటుందని అన్నారు. జూబ్లిహిల్స్ లో ప్రజలు అభివృధ్ధి వైపే ఉన్నారని .. గద్వాల ఓటర్లు అభివృద్ధినే కోరుకుంటున్నారని చెప్పారు.






