- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక వదిలే సమస్యే లేదు.. ఎమ్మెల్యే మాధవరం అక్రమాలు బయటపెడతా: అరికపూడి సంచలన ప్రకటన
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Madhavaram Krishna Rao)కు అరికపూడి గాంధీ(Arekapudi Gandhi) బహిరంగా సవాల్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Madhavaram Krishna Rao)కు అరికపూడి గాంధీ(Arekapudi Gandhi) బహిరంగా సవాల్ చేశారు. 2009 నుంచి ఇద్దరి ఆస్తులపై విచారణ తాను సిద్ధమని ప్రకటించారు. సిట్టింగ్ జడ్జీ లేదా? ఈడీ విచారణను ఎదుర్కోవడానికైనా రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. సర్వే నెంబర్ 307లో మా కుటుంబసభ్యులు 9 మంది కలిసి ఆ 11 ఎకరాల భూమి కొనుగోలు చేశారని వివరణ ఇచ్చారు. ఆ 11 ఎకరాల భూమిపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఆ భూములతో SFCకి సంబంధం లేదని స్వయంగా హైకోర్టే చెప్పిందని గుర్తుచేశారు. ఆ 11 ఎకరాల భూముల వివరాలు అడిగితే బీఆర్ఎస్ నేతలకు ఇవ్వడానికి కూడా తాను సిద్ధమే ప్రకటించారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను.. త్వరలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్రమాలను బయటపెడతానని సంచలన ప్రకటన చేశారు. అక్రమాలు చేశానంటూ తనపై నిందలు వేస్తే ఊరుకోను.. ఆరోపణలు నిరూపించకపోతే ప్రజాకోర్టులో శిక్ష ఖాయమని హెచ్చరించారు. ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు.






