- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడ్చర్లలో పవన్ సినిమాలు ఆడనివ్వను.. మరోసారి అనిరుధ్ రెడ్డి ఫైర్
కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మరోసారి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. తెలంగాణ వాళ్లకు సెంటిమెంట్ ఎక్కువ అని అన్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమం వల్లనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మరోసారి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. తెలంగాణ వాళ్లకు సెంటిమెంట్ ఎక్కువ అని అన్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమం వల్లనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని తాను మొన్న కోరానని కానీ ఇప్పటి వరకు పవన్ చెప్పలేదని అసలు స్పందించడం కూడా లేదన్నారు. తమిళనాడు, ఢిల్లీ పోతే రెడ్ కార్పెట్ వేస్తారని పవన్ స్పందించడం లేదా అని ప్రశ్నించారు.
కానీ తన నియోజకవర్గం జడ్చర్లలో మాత్రం పవన్ సినిమాలు ఆడనివ్వనని చెప్పారు. తాను పవన్ కల్యాణ్ అభిమానే అని కానీ అంతకంటే తనకు తెలంగాణ సెంటిమెంటే ఎక్కువని అన్నారు. పవన్ మనల్ని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం సరికాదని జడ్చర్ల యువకులు కూడా తెలుసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అనిరుధ్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పందించారు. పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.






